Tuesday, October 8, 2013

మనఃవిహారం

మనఃవిహారం 

ఉన్న చోట ఉండనీయక లేని తీరాలకు తోడ్కొని పోయి 
మరో ప్రపంచం తీరాలని తాకించే వెందుకోయి 

నా జీవితంలో లేని రంగులు ఇక్కడ పరిచయం 
చేయడంలొ ఉద్దేశం ఏమిటోయి 

ఈ దారిలో పరచుకున్న పచ్చని పువ్వులు 
నా దారిలో ఎక్కడోయి 

ఇక్కడున్న కిల కిల రావాలు 
నేనున్నచోట వినిపించవు ఎందుకోయి 

ఈ సామరస్యం ఈ ఆనంద ప్రశాంతత 
నా వాళ్ళలో లేదేన్దుకోయి 

తిన్న కాడికి కుడు ఉండి  పేదరికాన్ని జయించిన 
ఈ సమాజము మనకేదోయి 

ప్రేమామృత ధారలు కురిపించే కమ్మని 
ఈ సంగీతం రణ గోన కటోరమైన కర్ణానికి తాకదేన్దుకోయి  

ఈ శ్రావ్యమైన ప్రదేశములో నన్ను దించుటకు 
నీకున్న కారణం ఏంటోయి 

ఈ సుందర మకరంద స్వప్నలోకంలో నే 
ఉంటాననే మారం చేయించే వెందుకోయి  

నిజ జీవితాన్ని ఎదుర్కోనలేని  
బలహినున్ని చేసేయ్యకోయి 

ఎంత అందంగా తీర్చిదిద్దినా 
ఈ సుందర సృష్టి భ్రమెనోయి 

భగవంతుడి చేతికున్న 
అధ్బుతం అదేనోయి 

నిజాన్ని అద్దంలో చూపించి 
మనసుతో బ్రమను సృష్టించి 
కావాల్సిన చోటకి యిట్టె తీసుకొనిపోయి 
కొంచమైన సేధతీరమని ప్రసాదించిన 
ఈ హాయి ఎంత తీయనోయి 
ఎంత తీయనోయి 

                                                                                                 అమృత బిందువు